భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెళ్లి చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. నిన్న అనుష్క తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబయి నుంచి స్విట్జర్లాండ్ విమానం ఎక్కడం.. మరోవైపు కోహ్లి కూడా ఢిల్లీ నుంచి స్విస్ విమానంలోనే బయల్దేరడం.. మరోవైపు కోహ్లి సన్నిహితులు.. కుటుంబ సభ్యులు సైతం వేరుగా విదేశాలకు పయనం కావడంతో అందరూ అనుకుంటున్నట్లే ఈ నెల 12న వీరి పెళ్లి జరగబోతోందని స్పష్టమవుతోంది. అనుష్క కుటుంబ సభ్యుల భారీ లగేజీ చూస్తేనే.. వీళ్లది మామూలు పర్యటన కాదని స్పష్టమవుతోంది. ముందు స్విట్జర్లాండ్ కు చేరుకుని.. అక్కడి నుంచి ఇటలీలోని మిలాన్ కు చేరుకుంటారని.. 12న కుటుంబ సభ్యులు.. అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక సింపుల్ గా జరుగుతుందని అంటున్నారు.
ఈ పెళ్లికి ఇద్దరు ఫేమస్ క్రికెటర్లు హాజరవుతారని సమాచారం. ఆ ఇద్దరూ సచిన్ టెండూల్కర్.. యువరాజ్ సింగ్ అట. వీళ్లిద్దరూ కోహ్లికి ఎంతో సన్నిహితులు. ధోనితో పాటు ప్రస్తుత జట్టులోనూ కోహ్లికి ఆప్తులు ఉన్నప్పటికీ.. వాళ్లందరూ శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఎవరినీ పిలిచే పరిస్థితి లేకపోయింది. మరోవైపు అనుష్క.. కెరీర్ ఆరంభంలో తనకు అవకాశాలిచ్చిన యశ్ చోప్రా.. షారుఖ్ ఖాన్.. అమీర్ ఖాన్.. మనీష్ శర్మలను పెళ్లికి పిలిచిందట. పెళ్లి తర్వాత అధికారిక ప్రకటన చేస్తారని.. ఫొటోలు కూడా మీడియాకు రిలీజ్ చేస్తారని.. ఆపై క్రిస్మస్ వీకెండ్లో ముంబయిలో భారీ రిసెప్షన్ ఉంటుందని.. ఇటు క్రికెట్ అటు సినీ వర్గాల నుంచి భారీగా సెలబ్రెటీలు ఈ వేడుకకు హాజరవుతారని అంటున్నారు.