నానికి ఏమైంది..? కాస్త చూడండోయ్‌..!

250
mca another new song realesed
- Advertisement -

‘ఎంసీఏ’  చేస్తున్న నానికి సడన్‌గా ఏదో అయిందట. ఏమయుంటుందబ్బా..? అని ఆలోచిస్తున్నారా..? అసలు నానికి ఏమైందో.. నానికే తెలీదట. ఈ విషయాన్ని నాని చెప్తున్నాడు. అది కూడా పాట రూపంలో.

‘ఏమైందో తెలియదు నాకు.. ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు.. ఏమైందో తెలియదు నాకు.. ఏమైందో తెలియదు నాకు నాపైనే కురిసెను ప్రతి వర్షం చినుకు అంటూ నేచురల్ స్టార్ నాని ప్రేమపాటలు పాడుతూ ప్రేక్షకులకు ప్రేమికుడిగా మారిపోతున్నాడు.   నాని-సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎంసీఏ- మిడిల్ క్లాస్ అబ్బాయ్’.  డిసెంబర్ 21న ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక రీసెంట్‌ గా టీజర్‌, టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేసింది.

రాక్ స్టార్ దేశీ శ్రీ ప్రసాద్ సంగీతంలో ఇప్పటికే విడుదలైన ‘ఎంసీఏ’ టైటిల్‌ సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రాగా.. నాని-సాయి పల్లవిలపై స్వరపరిచిన  ఈ ప్రేమగీతం మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ‘ఏమైందో తెలియదు నాకు..’ అంటూ కార్తీక్, దీపిక ఆలపించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ రాశారు. మిడిల్ క్లాస్ అబ్బాయ్ ఫిదా బ్యూటీతో కలిసి పాడుతున్న లవ్ సాంగ్‌ని మీరూ వినండోయ్‌..! 🙂

https://www.youtube.com/watch?time_continue=250&v=4JpnGIEElRY

- Advertisement -