భారత క్రికెట్ జట్టు సీనియర్ ప్లేయర్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జహీర్ ఖాన్ ఫైనల్‌గా ఓ ఇంటివాడయ్యాడు. పెళ్లి సింపుల్‌గా చేసుకొని రిసెప్షెన్‌కి క్రికెట్ ప్రముఖులను పిలిచి పార్టీ ఇచ్చాడు. అయితే ఈ రిసెప్షెన్‌లో విరాట్,అనుష్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక విరాట్ – అనుష్క శర్మను అభిమానులు ముద్దుగా విరుష్క అని పిలుచుకుంటారు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టినీ తమ వైపే ఆకర్షిస్తుంటారు. అది టీవీ ప్రకటనైనా లేక హాలీడే ట్రిప్ అయినా ఏది చేసినా వాళ్ల మధ్య ఉన్న బంధం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తుంటుంది. అక్కడ కూడా తమదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నారు.
ఆ రిసెప్షన్ వారిద్దరూ కలిసి పెళ్లి జంటతో చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ పాటలకు విరుష్క, జహారిక జంటలు స్టెప్పులు వేయడం ఇందులో ఉంది. విరాట్ ఇలా రిసెప్షన్‌లో సందడి చేయడం ఇదేం మొదటిసారి కాదు… గతంలో యువరాజ్ – హజల్ కీచ్‌ల రిసెప్షన్‌లో కూడా విరాట్ డ్యాన్స్‌లు వేశాడు.
ఇక వేడుకకి ప్రముఖ మాజీ క్రికెట్ ప్లేయర్స్ కూడా వచ్చారు. సచిన్ టెండూల్కర్ – వీరేంద్ర సెహ్వాగ్ – యువరాజ్ సింగ్ – రాహుల్ ద్రావిడ్ – హర్భజన్ సింగ్ తో పాటు అజిత్ అగార్కర్ కూడా వచ్చాడు. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా స్పెషల్ గెస్ట్ గా హాజరైంది.
https://youtu.be/wt4E0UjUW0o