కేటీఆర్…రాక్ స్టార్

230
ktr rock star
- Advertisement -

జీఈఎస్ సదస్సులో భాగంగా రెండో రోజు మంత్రి కేటీఆర్‌ తనదైన శైలీలో అందరిని ఆకట్టుకున్నారు.  పారిశ్రామికతలో మహిళల వాటా పెంచడంపై జరిగిన ప్లీనరీకి కేటీఆర్ మాడరేటర్‌గా అదరగొట్టారు. ఈ ప్లీనరిలో ప్యానలిస్టులుగా ఇవాంకా ట్రంప్,ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్,  బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లను వేదిక మీదికి ఆహ్వానించిన కేటీఆర్‌..ఆంగ్లంలో తాను చెప్పాల్సిన అంశాలను తణుకు..బెణుకు లేకుండా చెప్పేశారు.

మోడరేటర్‌ విధులను నిర్వహించడం తొలిసారి అని చెబుతునే ఎక్కడగా తొలిసారిగా మోడరేటర్ విధులు నిర్వహిస్తున్న ఫిలింగ్ రానివ్వలేదు. అంతేగాదు ఇవాంకాను సభకు పరిచయం చేసే సమయంలో కేటీఆర్ కొంత చమత్కారాన్ని ప్రదర్శించారు. తాను రాష్ర్టానికి ఐటీ మంత్రిని అని, కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఐటీ నామస్మరణ జరుగుతున్నదని, ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ అని మంత్రి కేటీఆర్ నవ్వులు పూయించారు.  కేటీఆర్ ప్రసంగంతో మీటింగ్ హాల్ మొత్తం కరతాళ ధ్వనులతో హోరెత్తింది. ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. కేటీఆర్‌ రాక్‌ స్టార్‌ అంటూ పలువురు ఈ సందర్భంగా కొనియాడటం  విశేషం.

- Advertisement -