తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా దక్షిణ కొరియా దేశంలోని సియోల్ నగరంతోపాటు వివిధ నగరాల్లో బృందం పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు పర్యాటక కేంద్రాలను సందర్షించి వాటి గురించి తెలుసుకున్నారు. అలాగే దక్షిణ కొరియా వ్యవసాయ సాగు విధానాన్ని కూడా అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నామని వినోద్ కుమార్ వెల్లడించారు.
Also Read:Harishrao:దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది
గోదావరి నది ఒడ్డున ఉన్న కరీంనగర్ లోనీ మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, మహబుబ్ నగర్ లోని ట్యాంక్ బండ్ అభివృద్ధి, అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్ జెయింట్ వీల్ వేవ్ పూల్, వాటర్ రైడ్స్,వాటర్ స్పోర్ట్స్ రాష్ట్రంలో మన్యంకొండ వద్ద మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న రోప్ వే, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పర్యాటకులకు కనువిందు చేసే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రుల పర్యటన సాగుతోంది.
Also Read:అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్:కేటీఆర్ ఫైర్
దక్షిణ కొరియా దేశంలోని సియోల్ నగరంతోపాటు వివిధ నగరాలను ఈరోజు పర్యటించాను. పలు పర్యాటక కేంద్రాలను సందర్షించి వాటిని విశ్లేషించాను. అందులో భాగంగానే అక్కడి వ్యవసాయ సాగు విధానాన్ని కూడా అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నాను. నాతో పాటు మంత్రులు @GangulaBRS, @VSrinivasGoud గార్లు,… pic.twitter.com/gnqnKfWWTg
— B Vinod Kumar (@vinodboianpalli) July 2, 2023