బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్!

9
- Advertisement -

బీసీ రిజర్వేషన్ల పెంపు పై రాష్ట్రం లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది… ఈ లోపే ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు అన్నారు.సీఎం ,మంత్రులు బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు అన్నారు.

ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరగవా అని అందరూ చర్చించుకుంటున్నారు…ఓకే అంశం మీద బీసీ బిల్లు, ఆర్డినెన్స్ ఉన్నపుడు ఆర్డినెన్స్ ఎపుడూ ఆమోదానికి నోచుకోదని మాకు ముందే తెలుసు అన్నారు. కాంగ్రెస్ బీజేపీ లు బీసీ లను ఎందుకు మోసం చేయాలని చూస్తున్నాయి….50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది అన్నారు.

తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు…తొమ్మిదో షెడ్యూల్ లో కీలక అంశాలను చేర్చడం అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం తర్వాత నెహ్రు ప్రధానిగా ఉన్నపుటి నుంచి ప్రారంభం అయింది అన్నారు.మాది మొదట్నుంచి తొమ్మిదో షెడ్యూల్ లో బీసీ రిజర్వేషన్ల పెంపును చేర్చాలని మా వాదన…నిన్న మా బీసీ లీడర్లు కూడా అదే చెప్పారు అన్నారు.

మోడీ ,రాహుల్ తలచుకుంటే పార్లమెంటు లో రిజర్వేషన్ల పెంపును గంటలో ఆమోదించవచ్చు…మోడీ కి చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ అడగరు అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షనాయకుడిగా పార్లమెంటు లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రైవేట్ బిల్లును ప్రవేశ పెట్టవచ్చు. చర్చ జరుగుతుంది…బీజేపీ కొత్త అధ్యక్షుడు రాంచందర్ రావు బీజేపీ అధికారం లోకి వస్తే బీసీని సీఎం గా చేస్తామంటున్నారు..బీసీ లకు రిజర్వేషన్లు పెంచని వారు బీసీ ని సీఎం చేస్తారా ? చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగం 243 డి కి సవరణ చేస్తే బీసీ ల రిజర్వేషన్లు పెంచవచ్చు. మోడీకి చిత్తశుద్ధి ఉంటె ఈ పని చేయవచ్చు…జీవో, ఆర్డినెన్స్ ల ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అన్నారు.గతంలోనే కేసీఆర్ బీసీ లకు చట్టసభల్లో రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపారు. …కేసీఆర్ పంపిన తీర్మానం, రేవంత్ రెడ్డి పంపిన బిల్లును పార్లమెంటులో చర్చించి ఆమోదించవచ్చు…రేవంత్ రెడ్డి ఢిల్లీ లో ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ తో మాట్లాడి మోడీ పై ఒత్తిడి పెంచవచ్చు. ..ధర్నాలు డ్రామాలు కాదు ..రాహుల్ ను వెంట తీసుకుని రేవంత్ పీఎం దగ్గరకు వెళ్ళాలి అన్నారు.243 డి కింద రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన ఎన్నో బిల్లులను పార్లమెంటు చట్టాలుగా చేసింది. ..కేసీఆర్ హయం లో పంపిన తీర్మానం తో రేవంత్ రెడ్డి పంపిన బిల్లును కలిపి పార్లమెంటు ఆమోదించాలి అన్నారు.

Also Read:బీఆర్ఎస్ పార్టీకి సింపతి ఉంది:ఫిరోజ్ ఖాన్

- Advertisement -