సింగపూర్ లో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను సందర్శించింది మంత్రి లోకేష్ బృందం. ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్ఫీరియన్స్ జోన్ ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. జనరేటివ్ ఆధారిత పరిష్కారాలను కొనుగొని సమన్వయం చేసుకునేందుకు వినతి ఇచ్చారు.
భారత్ లోని అతి పెద్ద నైపుణ్య ఐటీ నిపుణుల సమూహాల్లో ఏపీ ఒకటి. అమెరికాలోని భారతీయ ఐటీ శ్రామికశక్తిలో 25 శాతం కంటే ఎక్కువమంది తెలుగువారే… 2026లో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యంలో హ్యాకథాన్ నిర్వహించాలి అన్నారు. అవసరమైన అన్ని సౌకర్యాలు ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు.
మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో ఐటీ వర్క్ ఫోర్స్ అభివృద్ధికి నిపుణులను ఉపయోగించుకోవాలి…ఇన్ఫినియన్ సెమీ కండక్టర్స్ యూనిట్ ను సందర్శించింది లోకేష్ బృందం. ఏపీలో ఈఎంసీలు లేదా పారిశ్రామిక పార్కుల్లో సెమీ కండక్టర్స్ తయారీ, సెమీ కండక్టర్స్ తయారీకి అనుబంధంగా ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుచేయాలని కోరారు.
పవర్ మాడ్యూల్స్, ఇన్వర్టర్లు, బీఎంఎస్ వ్యవస్థలకు భాగస్వామ్యం వహించాలి అని… ఏపీ ప్రభుత్వం ఈవీ తయారీ యూనిట్లకు ప్రోత్సాహకాలు అందిస్తోంది అని చెప్పారు. తిరుపతి శ్రీసిటీ, అనంతపురం, కృష్ణా జిల్లా వంటి క్లస్టర్లలో ఓఈఎంలు ఆసక్తి కనబర్చారయని.. తిరుపతి శ్రీసిటీ, అనంతపురం, కృష్ణా జిల్లా వంటి క్లస్టర్లలో ఓఈఎంలు ఆసక్తి. ఇంజనీర్లు, టెక్నీషియన్ల శిక్షణ కోసం సెమీ కండక్టర్ స్కిల్ అకాడమీ ఏర్పాటు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సహకారం అందించాలి అని కోరారు.
Also Read:బీఆర్ఎస్ పార్టీకి సింపతి ఉంది:ఫిరోజ్ ఖాన్

