రివ్యూ:వినయ విధేయ రామ

598
Vinaya Vidheya Rama movie review
- Advertisement -

రంగస్థలం సినిమాతో చిట్టిబాబు పాత్ర ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో రామ్‌ చరణ్‌. తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తు మెగా వారసుడిగా సత్తాచాటాడు చెర్రీ. తాజాగా మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి రేసులో వచ్చిన రాముడు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నారు..?చెర్రీ-బోయపాటి కాంబో ఏ విధంగా ఉందో చూద్దాం…

కథ:

ఐదుగురు అన్నదమ్ములు (ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌) అందమైన ఫ్యామిలీలో చిన్నవాడు రామ్ (రామ్‌చరణ్). రామ్ పెద్ద‌న్న (ప్ర‌శాంత్‌) విశాఖ ఎలక్షన్ కమీషనర్‌గా ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం(ముఖేష్ రుషి) అరాచ‌కాల‌కు అడ్డుపడతాడు. దీంతో రామ్ కుటుంబాన్ని అంతమొందించేందుకు మున్నాభాయ్‌(వివేక్ ఒబెరాయ్‌)ని రంగంలో దించుతాడు పరశురాం. సీన్ కట్ చేస్తే తర్వాత ఏం జరుగుతుంది..?తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని రామ్‌ ఏ విధంగా ఎదుర్కొన్నాడు అన్నది తెరమీద చూడాల్సిందే.

Image result for vvr review

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ రామ్‌ చరణ్‌,యాక్ష‌న్ ,మాస్ ఎలిమెంట్స్‌. ర‌ంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ పవర్‌ ఫుల్ పాత్రలో కనిపించాడు. ఫ్యామిలీ డ్రామా, ల‌వ్‌, ఫ‌న్‌ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. సినిమాకు మరింత అందాన్ని తెచ్చింది కైనా అద్వాని. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. మిగితా నటీనటుల్లో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌ వందశాతం న్యాయం చేశారు. విలన్‌గా రెచ్చిపోయి నటించాడు వివేక్ ఒబెరాయ్.రామ్‌-వివేక్ పోరాట స‌న్నివేశాలు సినిమాకే హైలైట్‌.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ,మితిమీరిన హింస‌. యాక్ష‌న్ ఎపిసోడ్ల మూలంగా క‌థ బాగా న‌లిగిపోయింది. బోయ‌పాటి శైలిలోనే క‌థ ప్రారంభ‌మై చాలా మాసీగా సాగుతుంది.బోయ‌పాటి గ‌త చిత్రాల‌న్నీ క‌లిపి క‌ట్టుగా చూసిన‌ట్లు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు బాగున్నాయి. పాట‌ల్లో సాహిత్యం, బీట్ క‌న్నా రామ్‌చ‌ర‌ణ్ స్టెప్‌లు అభిమానుల‌ను మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ బాగుంది. మాటలు,రామ్ చరణ్‌ డైలాగ్‌లు సినిమాకే హైలైట్. డివీవీ దానయ్య నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for vvr review

తీర్పు:

మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్‌-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వినయ విధేయ రామ. రామ్ చరణ్‌ నటన,యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా కథ మైనస్‌. ఓవరాల్‌గా సంక్రాంతి రేసులో ప్రేక్షకులకు నచ్చే వినయ విధేయ మాస్ రాముడిగా రామ్‌ చరణ్‌ని నిలబెట్టిన చిత్రం వీవీఆర్‌.

విడుదల తేదీ:11/01/19
రేటింగ్:2.75/5
నటీనటులు: రామ్‌చరణ్‌, కైరా అద్వాని
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
నిర్మాత: డీవీవీ దానయ్య
దర్శకత్వం: బోయపాటి శ్రీను

- Advertisement -