హైదరాబాద్ అమ్మాయితో విశాల్ పెళ్లి..!

207
vishal anisha

అన్నమాటను నిలబెట్టుకుంటున్నారు హీరో విశాల్. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా సొంత బిల్డింగ్ నిర్మాణం జరిగిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని శపథం చేసిన విశాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. హైదరాబాద్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడు ఈ తమిళ స్టార్.

త్వరలోనే హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మేన్‌ కూతురు అనీషాతో విశాల్‌ వివాహం చేయబోతున్నాం అని విశాల్‌ తండ్రి, నిర్మాత జీకే రెడ్డి తెలిపారు. అయితే విశాల్‌ది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. లవ్ మ్యారేజీ.

హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజ కుమార్తె అనీషను విశాల్‌ పెళ్లాడనున్నారు. మాది లవ్‌ మ్యారేజ్‌. త్వరలో రెండు కుటుంబాలు కలుసుకొని ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ని ఫిక్స్‌ చేస్తారు. నిర్మాతల సంఘం నూతన భవన నిర్మాణం పూర్తయ్యాక, అందులోనే పెళ్లి చేసుకుంటాను అని విశాల్‌ తెలిపారు.

ఇక విశాల్ ..వరలక్ష్మీతో లవ్‌లో ఉన్నారని త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిని వారిద్దరు ఎప్పుడు ఖండించలేదు. దీంతో వరలక్ష్మీతో విశాల్ పెళ్లి ఖాయమనుకున్నారు అంతా. ఎవరు ఉహించని విధంగా హైదరాబాద్‌ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించి టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు.