భార్య తప్పు చేసిందని ఊరంతా చెప్పమంటూ..!

221
Villager shamed for defying poll diktat
Villager shamed for defying poll diktat
- Advertisement -

మన భారతదేశం అనేక సంస్కృతి,సంప్రదాయాలకు, అనేక మత భావాలకు, కట్టుబాట్లకు నిలయం. డిజిటల్‌ వైపు పరుగులు పెడుతున్న భారత్‌ లో ఇంకా కొన్ని గ్రామాల్లో కాప్ పంచాయితీల తరహా వ్యవహారమే రాజ్యమేలుతోంది. వ్యక్తుల స్వేచ్చను, హక్కులను కాలరాస్తున్న కొన్ని గ్రామ పంచాయితీలు తమకు నచ్చిన రీతిలో తీర్పులు ఇచ్చేస్తున్నాయి. ఇటీవల హర్యానాలో ఇలాంటి పరిస్థితులు వెలుగుచూడగా.. తాజాగా ఒడిశాలోని అనుగుల్‌ జిల్లా రగుడిపడాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే.. రగుడిపడాలో పంచాయితీ పెద్దలంతా కలిసి ఓ గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో తాము సూచించిన అభ్యర్థికే ఓటేయాలని గ్రామస్తులందరికి హుకుం జారీ చేశారు. రగుడిపడా గ్రామంలో వార్డు సభ్యురాలు మల్లికా సాహు పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్థులు బలపరిచిన సర్పంచి అభ్యర్థికి ఓటు వేయకుండా.. తనకు నచ్చిన అభ్యర్థికే ఓటు వేశారు.

దీంతో ఆగ్రహించిన గ్రామ కమిటీ సమావేశం నిర్వహించి వార్డు సభ్యురాలికి రూ.అర లక్ష జరిమానా వేసింది. అంత జరిమానా తాము చెల్లించలేమనడంతో రూ. 5000లతో పాటు ఊరంతా జయగంట కొడుతూ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తిరుగుతూ తన భార్య తప్పు చేసిందని చెప్పాలని తీర్పిచ్చారు. దీంతో గురువారం మల్లిక భర్త దుష్మంత్‌ సాహు తీవ్ర అవమాన భారంతో కుంగిపోయారు. జయగంట కొడుతూ పంచాయతీలోని గ్రామాలలో తిరుగుతూ గ్రామ కమిటీ సూచించినట్లు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సాహుని పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. సాహు గ్రామ కమిటీపై కేసు పెట్టడానికి వెనుకంజ వేయడంతో పోలీసులే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -