గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే హతం…

344
vikas dubey
- Advertisement -

కరడుకట్టిన నేర‌గాడు, కాన్పూర్‌కు చెందిన‌ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే హతమయ్యాడు. నిన్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో వికాస్‌ను పోలీసులు పట్టుకోగా ఇవాళ కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తా పడింది. దీంతో ఇదే అదునుగా తప్పించుకోవడానికి వికాస్ ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. వికాస్‌ మృతదేహాన్ని కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు వికాస్ ఆస్తులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. వేల కోట్లలో అక్రమ ఆస్తులు సంపాదించాడనే సమాచారంతో వికాస్ ఆస్తులతో పాటు ఆయన బినామీలపై దృష్టిసారించారు ఐటీ శాఖ అధికారులు.

వికాస్ దూబే సన్నిహితుల‌ పేరిట దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తోపాటు పలు దేశాల్లో ఆస్తులున్నాయని వెల్లడైంది. దూబే ఎనిమిది నెలల క్రితం లక్నోలో రూ.5 కోట్లు వెచ్చించి ఓ భవనం కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతోపాటు బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లో వికాస్ దూబే పెట్టుబడి పెట్టిన‌ట్లు సమాచారం. వికాస్ దూబేకు 12 ఇండ్లు, 21 ఫ్లాట్లు ఉన్నాయని పోలీసులు ఇప్ప‌టికే గుర్తించారు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరపనున్నారు ఐటీ శాఖ అధికారులు. దర్యాప్తు జ‌రుపుతున్నారు.

- Advertisement -