గ్రేటర్‌ రోడ్ల విస్తరణ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

60
ktr

జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్ల విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. ప్రగతి భవన్‌లో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించిన కేటీఆర్..భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో రోడ్ల విస్తరణ, నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.

నగరంలోని ప్రతి వంద ఫీట్లరోడ్ల వెంట మొక్కలు పెంచాలని కమిషనర్ లోకేశ్‌కుమార్ను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రిడ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో చేపట్టిన 23 లింకు రోడ్ల నిర్మాణం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతోపాటు కమిషనర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.