గర్భిణీకి వైద్యం అందించిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్..

284
methuku anand
- Advertisement -

క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈసంద‌ర్భంగా ప్ర‌జా ప్ర‌తినిధులు గ్రామాల్లో తిరిగి ప్ర‌జ‌ల ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. తాజాగా వికారాబాద్ లో ఇంటింటికి తిరిగారు ఎమ్మెల్యే డాక్ట‌ర్ మెతుకు ఆనంద్. వికారాబాద్ లోని మోమిన్ పేట్ మండ‌లంలోని టేకుల‌ప‌ల్లి గ్రామంలో 9 నెల‌ల గ‌ర్భిని మ‌హిళ సుధారాణికి స్వ‌యంగా వైద్యం అందించారు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.

సుధారాణి భ‌ర్త మెడికల్ హెల్ప్ లైన్ నెంబర్ కి ఎమర్జెన్సీ ఉందని కాల్ చేయడంతో అదే గ్రామంలో కూరగాయల పంపిణీ కోసం మొబైల్ వ్యాన్ ని ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విషయం తెలుసుకుని, తాను స్వయంగా డాక్టర్ కావడంతో సుధారాణికి వైద్యం అందించారు. గ‌ర్భిని వైద్యం అందించిన త‌ర్వాత ఆమె రిపోర్టులు అన్ని ప‌రిశీలించారు.

సుధారానణికి రక్తం తక్కువగా ఉందని పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి అన్నారు. కాన్పుకు ఇంకా 20 రోజుల సమయం ఉందని పురిటి నొప్పులు వస్తే వెంటనే ఫోన్ చేయాలి అని ఫోన్ నెంబర్ ఇచ్చారు. సుధారాణికి కావాల్సిన మందుల ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు.3 వ కాన్పు కోసం ఉన్న సుధారాణికి ఇంటికి వెళ్లి వైద్యం అందించాలి అని ఆశవర్కర్లు గోవిందమ్మ, మార్తమ్మలను ఆదేశించారు.

mla methuku anand

- Advertisement -