ఆ స్టార్ పై విజయకాంత్ ఫ్యాన్స్ ఫైర్

32
- Advertisement -

డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ గురువారం కన్నుమూసిన క్షణం దగ్గర నుంచి ఆయనకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయకాంత్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. మంచి మనిషి, కానీ ముందు చూపు లేని ఆవేశపరుడు. ఈ లక్షణమే ఆయనను సినిమాల్లో హీరోని చేసింది. కానీ, ఇదే లక్షణం ఆయనను రాజకీయాల్లో జీరోని చేసింది. నిజానికి విజయకాంత్ జీరో కాదు, హీరోనే. కానీ, ఆయన చుట్టూ ఉన్న వారే ఆయనకు వెన్నుపోటు పొడిచి జీరోగా మారారు. వారిలో ఎందరో ఉన్నారు, హీరో విజయ్ తో సహా.

అందుకే, విజయ్‌ దళపతిపై చెప్పు పడింది. విజయ్ దళపతి గురువారం రాత్రి విజయకాంత్‌కు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విజయ్ తిరిగి వెళుతుండగా గుంపులో ఒకరు అతనిపై చెప్పు విసిరిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు గెట్ అవుట్ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. అదేంటి ? విజయ్ పై విజయకాంత్ అభిమానులు ఇలా ఎందుకు రెచ్చిపోయారు. కారణం ఒక్కటే. విజయకాంత్ సాయంతోనే విజయ్ హీరోగా నిలబడ్డాడు. ఒక విధంగా విజయ్ కి మొదట్లో స్టార్ హీరోగా గుర్తింపు రావడానికి కారణం విజయకాంతే.

అలాంటి విజయకాంత్ రాజకీయాల్లో పోరాటం చేస్తున్న సమయంలో హీరో విజయ్ ఎప్పుడూ ముందుకు రాలేదు. పైగా తాను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చాడు. దీన్ని విజయకాంత్ కూడా అవమానంగా ఫీల్ అయ్యేవారు అని టాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే విజయ్ పై విజయకాంత్ అభిమానులు సీరియస్ అయ్యారు. అవుతూనే ఉన్నారు. మరోవేపు సినీ, రాజకీయ ప్రముఖులు విజయకాంత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విజయకాంత్ రాజకీయ ప్రయాణాన్ని చూసి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలి.

Also  Read:Mahesh:మహేష్ రు’బాబు’.. కిక్కివ్వాట్లేదా?

- Advertisement -