- Advertisement -
బాహుబలి తర్వాత భారతీయ సినిమా మేకింగ్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. తాజాగా బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాద్ నుంచి మరో అధ్బుత దృశ్య కావ్యం పట్టా లెక్కనుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆశ్రమ వాసుల కథతో రూపొందనున్న ఈ చిత్రం 1770. అగ్ర దర్శకుడు రాజమౌళ వద్ద ఈగ, బాహుబలి చిత్రాలకు పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన బెంగాలీ నవల ఆనందమఠ్ ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దారు. వందేమాతరం అనే పదంలో అద్భుతమైన మేజిక్ ఉందని ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో 1770 విడుదల కానుందని తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
- Advertisement -