సీనియర్ హీరోయిన్లు రాశి, రంభలపై ఏపీలో కేసు నమోదైంది. ఈ హీరోయిన్లు చేసిన వాణిజ్య ప్రకటనల వల్ల తాను మోసపోయానని ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ప్రకటనలను తక్షణం ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలు ప్రోత్సహించడం సరికాదని సూచించింది. రాశి, రంభ లాంటి సినితారలతో ప్రసారమాద్యమాలలో కలర్స్ అనే సంస్ధ నిర్వహిస్తున్న ప్రకటనలు నిలుపదల చేయాలని కన్స్యూమర్ కోర్ట్ పేర్కొంది.
కలర్స్ వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోస పోయిన జస్టిస్ మాధవరావు అనే వ్యక్తి కలర్స్ సంస్ధకు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9శాతం వడ్డితో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలను జరిమానాగా చెల్లించాలని, వెంటనే రాశి, రంభల ప్రకటనలను ఆపేయాలని తీర్పునిచ్చారు. సెలబ్రెటీలు కూడా ఇలాంటి ప్రకటనలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.