లేటు వయసులో మళ్లీ హీరోయిన్ గా

74
- Advertisement -

ఒకప్పటి హీరోయిన్ రంభ ఇప్పుడు మళ్లీ తన నటనతో అలరించడానికి సన్నద్ధం అవుతుంది. ఏభై ఏళ్లకు దగ్గరలో ఉన్న ఈ మాజీ బ్యూటీ ఇంకా తనలో నటన పై తపన, తాపత్రయం ఉన్నాయని, అవకాశాలు వస్తే గ్లామరస్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తానూ ఎప్పుడు ముందు ఉంటానని హీరోయిన్ రంభ ఫిల్మ్ మేకర్స్ కు మెసేజ్ లు పాస్ చేస్తోందట. దాంతో ఓ తమిళ సినిమాలో రంభకు అవకాశం దక్కింది. పైగా, రంభ ఈ సినిమాలో హీరో విశాల్ తో డ్యూయెట్లు పాడనుంది. వీళ్లద్దరూ జత కట్టి, ఓ మాస్ సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ వేస్తారట.

విశాల్ హీరోగా ఓ సినిమా రానుంది. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించారు. అప్పటి నుండి ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ లో చాలామంది పేర్లు అనుకున్నారు. ఓ దశలో సిమ్రాన్ కూడా నటిస్తోందని వార్తలు వచ్చాయి. కానీ చివరకు ఈ ఛాన్స్ రంభ దగ్గరకు వెళ్ళింది. ఎక్స్ పోజింగ్ విషయంలో నేటికీ రంభకు ఎలాంటి పరిధులు ఉండవు. మరీ తన కొత్త ఇన్నింగ్స్ లో రంభ ఎలా నటిస్తోందో చూడాలి.

నిజానికి రంభ తల్లి లేదా అక్క వదిన పాత్రలకు షిఫ్ట్ అయి, ఆర్టిస్ట్ గా మళ్ళీ బిజీ అవ్వాలనుకుంటున్న టైంలో విశాల్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడం అంటే, రంభ కెరీర్ కి అది పెద్ద ప్లస్ పాయింటే. ఎలాగూ గతంలో ఎన్టీఆర్ సినిమాలో ఓ సాంగ్ లో నటించి మెప్పించింది. కాకపోతే రంభలో మునపటి బిగువు లేదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ టైంలో రంభ గ్లామర్ రోల్ చేస్తే.. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి…

ధోని తొలి ఎంటర్‌టైనర్ ఎల్‌జిఎం..

బాలయ్య హ్యాట్రిక్ కొడతాడా?

ఆర్ఆర్ఆర్…జపాన్‌లో 100రోజులు

- Advertisement -