పిల్లలు పుట్టడంలేదని..ఆసుపత్రిలో పాపను కిడ్నాప్ చేసి

760
khammam Chaild
- Advertisement -

ఖమ్మం ఆసుపత్రి నుంచి 16రోజుల పసిపాప కిడ్నాప్ కేసును ఛేదించారు ఖమ్మం పోలీసులు. ఈసందర్భంగా ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కృష్ణా జిల్లా మైలవరం కు చెందిన కళ్యాణి పసిపాపు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. పిల్లలు లేకపోవడం వల్లే కళ్యాణి ఈ పని చేసినట్లు వివరించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కళ్యాణికి వివాహం అయి 10సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కాకపోవడంతో…మరో పెళ్లి చేసుకుంటానని భర్త బెదిరించాడు.

Khammam_CP

దీంతో ఆమె పిల్లల కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఆయాను ఆశ్రయించింది. మొత్తం రూ.30వేలకు బేరం మాట్లాడుకుని రూ.15వేలు అడ్వాన్స్ ఇచ్చి పాప కిడ్నాప్ కు ప్లాన్ చేశారు కళ్యాణి, ఆయా శైనాజ్. నిందితులు కళ్యాణీ , శైనాజ్ , రాము, రజిని, తిరుపతిరావు, నాగేంద్ర లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు సీపీ. పాప ఆచూకి కోసం మూడు ప్రత్యేక బృందాలు పనిచేశాయి. సీసీ టీవీ పుటేజీ , ట్రాకింగ్ టీం సహాయంతో కిడ్నాపర్లను పట్టుకోగలిగాం. పాప క్షేమంగా ఉంది. పాపను తల్లికి అప్పగించినట్లు తెలిపారు.

- Advertisement -