పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన తుమ్మల..

33
tummala nageshwar rao

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ మేరకు ఖమ్మం సీపీకి ఫిర్యాదు చేసిన తుమ్మల తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఎం కేసీఆర్‌ తనను అసాధారణ రీతిలో గౌరవించారన్నారని… ఓడిపోయినా తనకు మంత్రిగా అవకాశం కల్పించారన్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో ఖమ్మం జిల్లాలో రూ. 20 వేల కోట్లతో ప్రాజెక్టులు తీసుకొచ్చినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఖమ్మం మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ గెలుపుకోసం పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని చెప్పారు తుమ్మల.

సుదీర్ఘ కాలం తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఎవరికీ ఎలాంటి నష్టాన్ని కలిగించలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ తనకు అత్యంత ఆప్తుడు అని ఆయన నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయనని తెలిపారు.