పుష్ఫ నుండి విజయ్ ఔట్..!

343
vijay sethupathi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ నిర్మాణంలో రూపొందుతున్న‌ క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అల‌వైకుంట‌పురంలో వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ తో పాటు అటు సామాన్య ప్రేక్ష‌కుల్లో కూడా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తుండగా బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్‌ లుక్‌ పుష్ప కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. డేట్లు సర్దుబాటు కాకపోవడంతో బన్నీ మూవీ నుండి తప్పుకున్నారట. దీంతో విజయ్ ప్లేస్‌లో అరవింద్ స్వామి, బాబీ సింహ, సునీల్ శెట్టి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రోజుకో అప్‌ డేట్‌తో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది చిత్రయూనిట్.