ధోనికి ప్రత్యామ్నాయం రాహులే..!

165
gambir

ఐపీఎల్‌లో రాణించి తిరిగి భారత జట్టులోకి అడుగుపెట్టాలన్న మహేంద్ర సింగ్ ధోని ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కరోనా ఎఫెక్ట్‌తో ఐపీఎల్ 2020 దాదాపుగా రద్దయ్యే పరిస్థితి నెలకొనడంతో ధోని టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎంపీ,భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్. ధోని అంతర్జాతీయ మ్యాచ్ ఆడి సంవత్సరం అవుతోంది…ఎప్పుడు బరిలోకి దిగుతాడో తెలియదు..ఇలాంటి పరిస్థితుల్లో ధోనిని ఏ ప్రదర్శన ఆధారంగా జట్టులోకి ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.

ధోనికి లోకేష్ రాహుల్‌ ప్రత్యామ్నాయం..చక్కటి బ్యాట్స్‌మన్‌ కావడంతో పాటు సమర్థంగా కీపింగ్‌ చేస్తూ 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగలగడం జట్టుకు మేలు చేస్తుందని గంభీర్ సూచించాడు.