- Advertisement -
శ్రీలంక మాజీ లెజెండ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ వెండితెరపై రానున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్ని ఖరారు చేశారు.
ఈ సినిమా అనౌన్స్చేయడం,విజయ్ లుక్ బయటకు రావడంతో సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. షేమ్ ఆన్ విజయ్ సేతుపతి అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అయ్యింది. జాతి వివక్షను పాటించే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ జీవితాన్ని తెరపై చూపిస్తారా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో తాను ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్టు విజయ్ సేతుపతి ప్రకటించాడు. అటూ మురళి ధరన్ కూడా తన పై సినిమా తీయవద్దు అంటూ ఓ లేఖను విడుదల చేశాడు. ఉద్రిక్త పరిస్ధితులు ఉన్న నేపథ్యంలో సినిమా తీయకపోవడమే ఉత్తమమని వెల్లడించారు. దీంతో ప్రస్తుతానికి 800కి బ్రేక్ పడింది.
- Advertisement -