బాధిత కుటుంబాలకు రూ.10 వేల సాయం: మంత్రి కేటీఆర్

59
ktr

భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు మంగళవారం నుంచి ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ, శివారు ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితుల కోసం సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.550 కోట్లు కేటాయించారని, అవసరమైతే ఇంకా సహాయం అందజేస్తామని సీఎం ప్రకటించారని గుర్తుచేశారు కేటీఆర్. ప్రతి బాధిత కుటుంబానికి సహాయం అందాలని సీఎం సూచించారని తెలిపారు.

మూడు నుంచి నాలుగు లక్షల కుటుంబాలకు ఇండ్ల వద్దనే రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నామని తెలిపారు. సంక్షోభ సమయంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, ఎన్జీవోలు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ముంపు బాధితులకు అండగా నివాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.