విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతునన చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీలోకి విజయ్ జంగటా.. భాగ్యశ్రీ భోర్సే కనిపించనుంది. 2025 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా బృందం “అన్నా అంటేనే” అనే తదుపరి పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేయడంతో పాటు, హిందీ వెర్షన్‌పై కూడా ఓ క్లారిటీ ఇచ్చింది.
విడుదల తేదీ ప్రకటనలో హిందీ వెర్షన్ గురించి ప్రస్తావించకపోవడం వల్ల హిందీ డబ్ వెర్షన్ రద్దయిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా బృందం తెలిపిన వివరాల ప్రకారం, “సామ్రాజ్య్” అనే టైటిల్‌తో హిందీ వెర్షన్ కూడా అదే రోజున విడుదల కాబోతోంది.
అయితే నెట్‌ఫ్లిక్స్ నిబంధనలు కారణంగా, హిందీ వెర్షన్‌ను పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రదర్శించరు. ఇది కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది.
Also Read:గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

