- Advertisement -
గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతి రాజుకి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమింప బడటం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమైన క్షణం అన్నారు.
ఈ గౌరవాన్ని ఆయనకు అందించినందుకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రివర్గానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవాళ మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి. గోవా గవర్నర్‌గా పి.అశోక్ గజపతి రాజు, హర్యానా గవర్నర్‌గా ఆషిమ్ కుమార్ ఘోష్,లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమించారు.
Also Read:గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు
- Advertisement -

