దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆగస్టు 2025 నుండి దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా నిశితంగా పరిశీలన.. తప్పుడు / డూప్లికేట్ ఓటర్ల తొలగింపు లక్ష్యం అని వెల్లడించింది.
ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా ధృవీకరణ.. ఓటర్ల నకిలీ నమోదు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఖచ్చితమైన ఓటర్ల జాబితా కోసం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించిందని.. ప్రజలు ఓటర్ల జాబితా పై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
అయితే ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా మండిపడ్డాయి. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ఉన్న సవాళ్లపై సుప్రీం కోర్టు తుదినిర్ణయం చెప్పే వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను అమలు చేయకూడదని సూచించాయి. కాంగ్రెస్ నాయకుడు కే.సీ. వేణుగోపాల్ మాట్లాడుతూ బీహార్‌లో జరిగిన గందరగోళం సరిపోదన్నట్టు, ఇప్పుడు బీజేపీ నియంత్రిత ఎన్నికల సంఘం ఇదే భయం దేశవ్యాప్తంగా కలిగించాలనుకుంటోంది అని విమర్శించారు.
Also Read:లోకల్ బాడీ ఎన్నికల్లో చెప్పులు చూపించండి!
ప్రతి భారతీయ పౌరుడినీ అనుమానంతో చూస్తారు, వారి ఓటు హక్కులు ప్రమాదంలో పడతాయి, మొత్తం ఎన్నికల వ్యవస్థను వక్రీకరించేస్తారు అంటూ దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

