ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ ను సొంతం చేసుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తర్వాతి మూవీని రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తీయనున్నున్నాడు. ఇటివలే ఈప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈచిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈసినిమాకు ఛార్మీ నిర్మాతగా వ్యవహరించనుంది. దర్శకుడు పూరీ స్క్రీప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. కాగా ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శకుడు పూరీ జగన్నాథ్.
ఇక విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ బాక్సాఫిస్ వద్ద బోత్తా పడింది. భారీ బడ్జెట్ తో సినిమా తీసిన అనుకున్నంతగా హిట్ సాధించలేకపోయింది. దీంతో తన తర్వాత మూవీ పక్కా మాస్ యాంగిల్ ఉండాలని నిర్ణయించుకున్న విజయ్ పూరీతో సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పూరీ విజయ్ దేవరకొండ హిట్ ఇస్తాడో లేదో చూడాలి మరి.