చిరు మూవీ టైటిల్‌తో బిచ్చగాడు..

225
Vijay Antony Roshagadu
- Advertisement -

బిచ్చగాడు మూవీతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని. రొటీన్ కథలకు భిన్నంగా ప్రయోగాత్మక కథలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు మూవీ తరువాత భేతాళుడు, యమన్,ఇంద్రసేన వంటి చిత్రాలలో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం కాశి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

సాధారణంగా తమిళంలో సినిమా పూర్తయిన తరువాత తెలుగు టైటిల్ ను ఫిక్స్ చేసే ఆయన, ఈసారి తమిళంతో పాటు తెలుగులోనూ తన తదుపరి సినిమాకి టైటిల్ ను ఫిక్స్ చేశాడు.ఈ నెల 7వ తేదీన షూటింగ్ మొదలుకానున్న తన సినిమాకి ఆయన ‘రోషగాడు’ అనే టైటిల్ ను ఖరారు చేశాడు.

ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసిన ఆయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాకి గణేశ దర్శకత్వం వహించనుండగా గతంలో చిరంజీవి పాత్ర పేరైన ‘ఇంద్రసేన’ టైటిల్‌తో వచ్చిన విజయ్‌ ఇప్పుడు ఏకంగా చిరు మూవీ టైటిల్‌తోనే వస్తుండటం విశేషం.

- Advertisement -