దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్?

354
Ch Vidyasagar Rao
- Advertisement -

బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ దేశానికే రెండో రాజధాని కావొచ్చని చెప్పారు. ప్రస్తుత దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకరమైన స్ధాయికి చేరుకోవడంతో భారతరత్న బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ రెండో రాజధాని అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు.

హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. కాగా విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా దీపావళి పండుగ తర్వాత ఢిల్లీలో కాలుష్యం తీవ్రతరానికి చేరుకున్న సంగతి తెలిసిందే. కాలుష్యం ఎక్కువ కావడంతో మరోసారి సరి బేసి విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది ఢిల్లీ ప్రభుత్వం.

- Advertisement -