పెళ్లి చూపులు దర్శకుడితో వెంకటేశ్ 75వ మూవీ

400
Venkatesh Tharun Bhaskar
- Advertisement -

విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం నారప్ప సినిమాలో చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమిళ్ లో భారీ విజయం సాధించిన అసురన్ కి ఇది రీమేక్. నారప్పతో కలిపి వెంకటేశ్ ఇప్పటివరకు 74 సినిమాల్లో నటించాడు. ఇక వెంకటేశ్ తన 75వ సినిమాను కూడా ఒకే చేశారని తెలుస్తుంది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో వెంకటేశ్ 75వ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.

ఇటివలే తరుణ్ భాస్కర్ వెంకటేశ్ కథ వినిపించారని…ఆయన పూర్తి కథను రెడీ చేయమని చెప్పారాట. ఈ సినిమాను కూడా సురేశ్ ప్రొడక్షన్స్ వారే నిర్మించనున్నట్టు తెలుస్తోంది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనీ, ‘నారప్ప’ సినిమా షూటింగ్ పూర్తికాగానే కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -