సూపర్ స్టార్ రజనీ కాంత్ కి ఛేదు అనుభవం ఎదురైంది. తన ఇన్నేళ్ల జీవితంలో ఎన్నడూ జరగని పరిణామం. ఇటీవలె తూత్తుకుడిలో స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీని మూసీవేయాలంటూ అక్కడి ప్రజలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన కారులపై పోలీసుల కాల్పులు జరపడంతో 13 మంది మరిణింగా..30 మందికి పైగా గాయపడ్డారు.
అయితే త్వరలో పూర్తిగా రాజకీయ రంగప్రవేశం చేయనున్న రజనీ, పార్టీ కూడా పెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో తమిళ తంబీలతో మమేకం అవుతున్నారు… ఈ సందర్భంగా తూత్తూకుడి ఘటనలో గాయపడిన బాధితులని పరామర్శించేందుకు వెళ్లారు రజనీ.
గాయపడిన వారిలో ఒకరైన 21 ఏళ్ల సంతోష్ అనే బాధితుడిని పరామర్శించేందుకు వెళ్లగా.. ఆ యువకుడు రజనీని నీవు ఎవరు..? అంటూ ప్రశ్నించాడు.ఆ యువకుడు అలా అనడంతో ఇబ్బందికి గురైన రజనీ , కొద్ది సేపటి తర్వాత నవ్వి నేను రజనీ కాంత్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే రజనీ కంటే ముందు వచ్చిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంను కూడా ఆ యువకుడు ఇదే మాదిరిగా ప్రశ్నించాడు.
తూత్తుకుడి ఘటనపై అటు ప్రభుత్వంపై.. ఇటు పోలీసులపై ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఈ యువకుడిని చూస్తే తెలుస్తోంది. మరోవైపు మరామర్శించేందుకు వెళ్తున్న ప్రముఖులకు బాధితులు వ్యవహరిస్తున్న తీరుతో పెద్ద కష్టంగా మారింది.