లండన్‌లో హైదరాబాదీ దారుణ హత్య..

184
london hyderabadi

లండన్‌లో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నూర్ ఖాన్ బజార్‌కు చెందిన మహ్మద్ నజీముద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆరేళ్లుగా లండన్‌లోని ఓ సూపర్‌ మార్కెట్లో పనిచేస్తున్నాడు నజీముద్దీన్‌. గుర్తు తెలియని వ్యక్తి నజీముద్దీన్‌పై కత్తితో దాడి చేసి హతమార్చాడు.

పనిగంటలు ముగిసిన నజీమ్ ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబసభ్యులు యాజమాన్యానికి ఫోన్ చేయగా సెక్యురిటీతో కలిసి మార్కెట్ మేనేజర్ గాలింపు చర్యలు చేపట్టారు. భవనం సెల్లార్‌ పార్కింగ్‌లో నజీమ్ రక్తపు మడుగులో విఘతజీవిగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వగా నజీముద్దీన్‌ హత్యకు గల కారాణాలపై ఆరా తీస్తున్నారు.

నజీముద్దీన్ భార్య కూడ లండన్ లో డాక్టర్ గా పని చేస్తుంది. నజీముద్దీన్ హత్య విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.