సీనియర్ నటి సీత ఇకలేరు..

168
Senior actress Sita
- Advertisement -

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి సీత (87) నిన్న హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. నటి సీత ‘యోగి వేమన’ సినిమాతో బాల నటిగా తెరంగేట్రం చేసింది. ఆమె ప్రముఖ నటుడు నాగభూషణంను 1956లో ఆయనను వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె భువనేశ్వరి, కుమారుడు సురేందర్ ఉన్నారు.

అలనాటి మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి తదితర సినిమాల్లో ఆమె నటించారు. హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి సీత.. 2002లో చివరిసారి ‘నేనేరా పోలీస్’ సినిమాలో కనిపించారు. సుమారు 250 సినిమాల్లో నటించిన సీత.. 2 వేల వరకు నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రుతురాగాలు వంటి బహుళ ప్రేక్షకాదరణ పొందిన సీరియల్‌లోనూ నటించారు.

- Advertisement -