ఐపీఎల్ సరికొత్త రికార్డు..

111
ipl

ఐపీఎల్‌ 2020 13వ సీజన్‌ పెద్దగా హడావుడి లేకుండానే ప్రారంభమైంది. ఇప్పటికే రసవత్తరంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఐపీఎల్‌ 2020 అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 19న జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ టీవీ వీక్షణల పరంగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. అబుదాబిలో శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో 20 కోట్ల మంది చూశారు.

ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా, ఏ క్రీడలో అయినా, ఏ దేశంలో అయినా టీవీ, డిజిటల్ వ్యూస్ పరంగా ఇది రికార్డు అని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తెలిపారు. ఇదే విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించింది. డ్రీమ్ ఎలెవన్ ఐపీఎల్ అద్భుతంగా మొదలైందని.. తొలి మ్యాచ్‌ను 200 మిలియన్ల మంది వీక్షించారని ప్రకటించింది.