సౌత్ సినీ వెండితెర పై ఎందరో ఐటమ్ భామలు తమ శక్తివంచన లేకుండా తమ అందచందాలు విచ్చలవిడిగా పరిచారు. కానీ, ‘సిల్క్ స్మిత’ స్థాయిని ఏ ఐటమ్ భామ అందుకోలేకపోయింది. ‘సిల్క్ స్మిత’ ముద్ర మరో వందేళ్లు అయినా చెదిరిపోయేలా కనిపించడం లేదు. సిల్క్ స్మిత అంటేనే దక్షిణాది శృంగార సామ్రాజ్యానికి మాజీ మహారాణి. జీవితంలో ఎంత వేగంగా ఎదిగిందో, అంతకన్నా వేగంగా సిల్క్ కనుమరుగైపోయింది. కొన్ని కన్నీళ్లకు కాలం కూడా సమాధానం చెప్పలేదు. కొన్ని విషాదాలను చావు కూడా ఓదార్చలేదు. బహుశా సిల్క్ స్మిత జీవితం కూడా ఇదే కోవకు చెందింది.
ఏది ఏమైనా సిల్క్ స్మిత జీవితం ఒక చరిత్ర, సిల్క్ స్మిత హావభావాలు ఓ తరం కలల ప్రపంచం, సిల్క్ స్మిత అందచందాలు ఆడవాళ్లకే అసూయ రగిలించే సోపానాలు. వందల పాటలు, మరెన్నో మైమరిపించే పాత్రలు.. అందుకే బోల్డ్ ప్రపంచానికి సిల్క్ స్మిత ఇప్పటికీ ఎప్పటికీ స్పెషలే. అలాంటి సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం. అది 1996వ సంవత్సరం.. ఆ ఏడాదే సిల్క్ స్మిత బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు ఓ సూసైడ్ నోట్ రాసింది. ఆ నోట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Also Read: తల్లైన స్వామి రారా బ్యూటీ!
ఇంతకీ ఆ నోట్ లో ఏముంది అంటే.. ‘దేవుడా నా 7వ సంవత్సరం నుంచి నేను పొట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మినవారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా… అతను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణన్ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ నాకు వారు చేసింది చాలా దారుణం. నాకు ఒకడు 5 సంవ్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను’ అంటూ బాధతో స్మిత రాసుకొచ్చింది.
Also Read: హ్యాపీ బర్త్ డే..అనుష్క శర్మ