నటుడి మొదటి భార్య పోస్టులు వైరల్

24
- Advertisement -

తెలుగుతో పాటు పలు భాషల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న పాన్ ఇండియా సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి(60) రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితుల సమక్షంలో అసోంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువా‌ను ఆయన వివాహమాడారు. అయితే ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి పై ఆశిష్ మొదటి భార్య రాజోషి బారువా తాజాగా ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీస్ వైరలవుతున్నాయి.

‘మిమ్మల్ని ఇష్టపడే వారు మిమ్మల్ని బాధపెట్టే పనిని చేయరు. అతిగా ఆలోచించడం మానేసి, లైఫ్ లో ప్రశాంతతను నింపుకోవాలి’ అంటూ ఆమె స్టోరీలు పెట్టారు. అనంతరం ఆమె ఓ సెల్ఫీని పోస్టు చేయగా, మీరు విడాకులు తీసుకున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇపుడున్న సమాచారం ప్రకారం ఆశిష్ విద్యార్థి తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:IPL 2023:గుజరాత్ vs ముంబై.. ఫైనల్ కు వెళ్ళేదేవరు!

కానీ, పలు ఆస్తుల విషయంలో వీరి మధ్య కొన్ని గొడవలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే, ఆశిష్ మొదటి భార్య రాజోషి మిమ్మల్ని ఇష్టపడే వారు మిమ్మల్ని బాధపెట్టే పనిని చేయరు. అంటూ పోస్ట్ లు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఆశిష్ విద్యార్థి – రాజోషి బారువాకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

Also Read:నరాల బలహీనతకు చెక్.. పెట్టండిలా!

- Advertisement -