నరాల బలహీనతకు చెక్..పెట్టండిలా!

40
- Advertisement -

నేటి రోజుల్లో నరాల బలహీనత ఒక పెద్ద సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య చాలమందిని వేధిస్తుంది. మన శరీరంలో నాడీ వ్యవస్థ అత్యంత కీలకమైనది. మెదడు, వెన్నెముక, కాళ్ళు, చేతులు ఇలా అన్నీ అవయవాలకు నరాలు అనుసంధానమై ఉంటాయి. నాడీ వ్యవస్థకు ఏదైనా అంతరాయం ఏర్పడితే నరాల బలహీనత ఏర్పడుతుంది. ఇక కొన్ని రకాల ధీర్ఘకాలిక వ్యాధులతో భాడపడే వారికి కూడా నరాల బలహీనత సమస్య వేధిస్తుంది. .

హెచ్‌ఐ‌వి, గులియన్ బ్యారి సిండ్రోమ్, ఆర్థరైటిస్ వంటి ధీర్ఘకాలిక వ్యాధులు నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తాయి. నరాల బలహీనత ఉన్నవారికి కండరాల పటుత్వం లేకపోవడం, స్పర్శ లేకపోవడం, తరచూ తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇక నరాల బలహీనత ఉన్న వాళ్ళు చిన్న పని చేయడానికి కూడా అలసట చెందుతుంటారు. కాబట్టి ఈ సమస్య నుంచి విముక్తి పొండడానికి వివిధ రకాల మెడిసన్స్ వాడుతుంటారు. అయితే ఆయుర్వేధంలో నరాల బలహీనతకు చక్కటి పరిష్కారాలు ఉన్నాయని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. అశ్వ గంధ, అతిమధురం, వేరు పొడిని సమపాళ్ళలో తీసుకొని ప్రతిరోజూ ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో ఒక టీ స్పూన్ చొప్పున ఈ కలిపి తాగాలి.

ఇలా ప్రతిరోజూ ఉదయం సాయంత్రం రెండు నెలలపాటు తాగితే నరాల బలహీనత సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక నరాల బలహీనతను తగ్గించడంలో మనం తినే ఆహార పదార్థాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. నరాల బలహీనత ను తగ్గించేందుకు సీ ఫుడ్ అధికంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒమేగా 3 అధికంగా ఉండే చేపలను తింటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉందట. అలాగే విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనూ కాకుండా ఉండడం ద్వారా కూడా నరాల బలహీనత సమస్యను అధిగమిచ్చవచ్చు.

Also Read:గ్లామర్ ను నమ్ముకున్న మరో బ్యూటీ

- Advertisement -