29 నుండి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

6
- Advertisement -

కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు మే 29 నుండి జూన్ 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 28వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. జూన్ 7వ తేదీన మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

29-05-2024

ఉదయం – ధ్వజారోహణం

సాయంత్రం – పెద్దశేష వాహనం

30-05-2024

ఉదయం – చిన్నశేష వాహనం

సాయంత్రం – హంస వాహనం

31-05-2024

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

01-06-2024

ఉదయం – కల్పవృక్ష వాహన

సాయంత్రం – ఆర్జితకళ్యాణోత్సవం/ సర్వభూపాల వాహనం

02-06-2024

ఉదయం – మోహినీ అవతారం

సాయంత్రం – గరుడ వాహనం

03-06-2024

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – గజ వాహనం

04-06-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

Also Read:ఐపీఎల్ విజేతగా కోల్‌కతా

05-06-2024

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

06-06-2024

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో జూన్ 1వ తేదీ సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

- Advertisement -