పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌..

10
- Advertisement -

ఉమ్మడి నల్లగొండ – వరంగల్‌- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు.

మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈ ఎన్నిక బ్యాలట్‌ పేపర్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉండగా ఒక పోలింగ్‌ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. జూన్ 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు.

మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన తర్వాతే మిగతా ప్రాధాన్యత ఓట్లు వేయాలి.మొదటి ప్రాధాన్యత ఓటు వేయకపోతే ఆ ఓటు చెల్లదు.పురుషులు 2,88,189 ఓటర్లు ఉండగా మహిళలు 1,75,645, ట్రాన్స్‌జెండర్లు 5గురు ఉన్నారు.

Also Read:ఐపీఎల్ విజేతగా కోల్‌కతా

- Advertisement -