Venu Swamy: ప్చ్.. అతగాడి మాయలో హీరోయిన్లు

77
- Advertisement -

సినీ ప్రముఖుల ప్రమేయం లేకుండానే వారి జాతకాలు చెబుతూ పాపులారిటీ సంపాదించిన ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి. అటు యూట్యూబ్ పుణ్యమా అని ప్రజలకు సైతం సుపరిచితుడే. మరి ఇతగాడు ఎలాంటి మాయ చేస్తాడో తెలియదు గానీ, ప్రస్తుతం కొందరు హీరోయిన్లు ఇతగాడి మాయ మాటలు నమ్మేస్తున్నారు. తాజాగా ఇతగాడి మాయలో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పడిపోయింది. నిధి అగర్వాల్ తన ఇంట్లో వేణుస్వామి చేత పూజలు, యాగం చేయించింది. ఇండస్ట్రీలో తనకు మంచి అవకాశాల రావాలని నిధి రాజ శ్యామల పూజ చేయించినట్టు తెలుస్తోంది. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలతో ఫేమ్ అయిన ఈ హాట్ బ్యూటీ చివరకు ఇలా వేణుస్వామి లాంటి సోషల్ మీడియా జ్యోతిషుడిని నమ్ముకోవాల్సి వచ్చింది.

అన్నట్టు.. ఈ వేణుస్వామి చేత ఆ మధ్య నభా నటేష్ కూడా పూజలు చేయించుకుంది. అయితే, నభా జాతకం అయితే ఏమీ మారలేదు. అంతకు ముందు ప్రణీత సుభాష్ పరిస్థితి సైతం ఇంతే. గ‌తంలో హీరోయిన్ ర‌ష్మిక కూడా వేణుస్వామితో ప్రత్యేక పూజ‌లు చేయించింది. ఈ క్రమంలోనే ర‌ష్మిక ఎంపీ అవుతుంది అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చాడు. పాపం అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా ర‌ష్మిక క్రేజ్ తగ్గుతూ వస్తోంది.

అలాగే హీరోయిన్ సమంత కూడా వేణుస్వామితో పూజలు చేయించుకున్నట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఐతే, వేణుస్వామితో పూజలు తర్వాత సమంత అనారోగ్యానికి గురి అయ్యింది. వేణుస్వామి పూజల తాలూకు వాస్తవ పరిస్థితులు ఇవి. కానీ, నిజాలు తెలియని నిధి అగ‌ర్వాల్, రష్మిక లాంటి కొందరు హీరోయిన్లు మాత్రం ఇంకా వేణుస్వామి మాయలోనే పడిపోతున్నారు. ప్ర‌స్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాలో తన నటనపై ఫుల్ ఫోకస్ పెట్టి.. బాగా నటిస్తే… ఆ తర్వాత ఆవ‌కాశ‌లు అవే వస్తాయి. కాస్త ఆలోచించు నిధి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -