alluarjun:నేటితో 2దశాబ్దాల సినీ జీవితం..!

42
- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వస్తే హీరో అవుతారా..అనే విమర్శ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ఒక హీరో. కాదు కాదు స్టైల్‌కు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన హీరో. మరేవరో కాదు బన్నీ. అవును సరిగ్గా 20యేళ్ల క్రితం తొలిసారి గంగోత్రి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బన్నీ. అంచెలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. అంతేకాదు అంతర్జాతీత స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు.

ఈ సందర్భంగా బన్నీ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 20యేళ్లు పూర్తియింది. మీరందూ ప్రేమాభిమానాలతో నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. నేడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీ అభిమానం. ఎప్పటికీ మీకు నేను ఋణపడి ఉంటాను అంటూ తన అభిమానులకు బన్నీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అల్లుకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రస్తుతంబన్నీ పుష్ప-2పార్ట్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అంతేకాదు ఏప్రిల్‌ 8న బన్నీ పుట్టినరోజు సందర్బంగా సుకుమార్ పుష్ప-2 నుంచి 3నిమిషాల నిడివి గల టీజర్‌ విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు టాలీవుడ్‌లో టాక్‌. అయితే ఈ టీజర్‌ బన్నీ లుక్‌ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

నాగబాబు పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్

Chatrapathi ఎట్టకేలకు విముక్తి

పిక్ టాక్ : బాబోయ్ ఏంటి ఈ అందాలు

- Advertisement -