టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మల్టీస్టారర్ `వెంకీమామ`. విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం ఇద్దరి హీరోల అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో …
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ – “వెంకటేశ్, నాగచైతన్య అభిమానులకు ఇది పెద్ద పండగలాంటి సినిమా. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ బాబీగారికి, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, డి.సురేష్‌బాబు సహా ఫ్యాన్స్‌కు కూడా ఇది పెద్ద పండగ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – “ఈ సినిమాను రెండు బ్యానర్‌లు నిర్మించాయి. ఇద్దరు ప్రొడ్యూసర్ కానీ నిజానికి నలుగురు ప్రొడ్యూసర్స్ మా సినిమాకు పనిచేశారని చెప్పాలి. ఎందుకంటే హీరోలు వెంకటేశ్, చైతన్యలిద్దరూ నిర్మాతలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఈ సినిమా చక్కగా వచ్చింది. వారికి ఈ సందర్భంగా థ్యాంక్స్. ఎమోషనల్ సీన్స్ చేయడంలో వెంకటేశ్‌గారు మాస్టర్ ఆయనతో పాటు చైతన్యగారు కూడా ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా నటించారు. డిసెంబర్ 13న విడుదలవుతున్న ఈ సినిమాను అందరూ చక్కగా ఆదరిస్తారని నమ్ముతున్నాను“ అన్నారు.
నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ – “నాకు వెంకీమామ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సురేశ్‌బాబుగారు, వెంకటేశ్‌గారు, చైతన్యగారు, బాబీగారికి థ్యాంక్స్. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌తో ఉన్న సినిమా ఉన్న సినిమా. డిసెంబర్ 13న సినిమా విడుదలవుతుంది“ అన్నారు.
నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ – “మానవ సంబంధాలపై తెరకెక్కించిన చిత్రం `వెంకీమామ`. ఏడాదిన్నర క్రితం జనార్ధన మహర్షి అనే రైటర్ వచ్చి ఈ కథను నాకు వినిపించారు. విన్నాను.. బావుంది. చూద్దాం అన్నాను. తర్వాత ఆ కథ బాబీ చేతికి వచ్చింది. ఆయన దాన్ని అద్భుతంగా డెవలప్ చేశారు. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్స్, రిలేషన్ షిప్స్, త్యాగాలు ఇలా అన్ని అంశాలుంటాయి. రాజమండ్రి, హైదరాబాద్, కాశ్మీర్‌లో ఈ సినిమాను చిత్రీకరించాం. కాశ్మీర్‌లోని రిస్కీ లొకేషన్స్‌లో ఈ సినిమాను 25 రోజుల పాటు చిత్రీకరించాం. భారత అధికారులు, ఆర్మీ అధికారులు మాకెంతో సహాయపడ్డారు. ఇంకా చాలా మంది కాశ్మీర్‌కు రావాలని, అక్కడ షూటింగ్‌లు చేయాలని అందరూ మాకు సపోర్ట్ చేశారు. బ్రహ్మాపుత్రుడు చిత్రాన్ని కాశ్మీర్‌లో చిత్రీకరించాం. తర్వాత ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాం. కానీ కాశ్మీర్ వంటి అందమైన ప్రాంతం.. మన దేశంలో ఉండటం ఊహించుకుని చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మావయ్య సురేంద్రగారిని బాగా ఇష్టపడేవాడిని. అలా ప్రతి ఒక్కరికీ వారి మేనమామలతో మంచి అనుబంధం ఉంటుంది. అలాంటి మామ, అల్లుడు మధ్య అనుబంధాన్ని తెలియజేసే చిత్రమిది. నేను సినిమా చూశాను. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఈ సినిమాకు పనిచేసిన రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో ప్రకాశ్‌రాజ్‌గారు నటించారు. చాలా ఇన్‌వాల్వ్‌మెంట్‌తో ఈ సినిమాలో మాకు సపోర్ట్ చేశారు. ఆయనకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. రావు రమేశ్‌గారు తొలిసారి మా బ్యానర్‌లో పనిచేశారు. వెంకటేశ్, చైతన్య అందరూ సినిమా చూసి బావుందన్నారు. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా చూసి బావుందన్నారు. నవరసాలున్న సినిమా. డిసెంబర్ 13న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 7న ఖమ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాం“ అన్నారు.
రాశీఖన్నా మాట్లాడుతూ – “నేను కూడా మీలాగే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. హీరోయిన్‌గానే కాదు, వెంకటేశ్ అభిమానిలా ఎదురుచూస్తున్నాను. చైతన్యతో పాటు వెంకటేశ్‌గారితో కలిసి నటిచండం హ్యాపీగా అనిపించింది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయన గొప్ప నటుడే కాదు.. గొప్ప వ్యక్తి. చైతుతో మనం తర్వాత కలిసి పనిచేస్తున్నాం. మామ, అల్లుడు మధ్య రిలేషన్ తెరపైనే కాదు, సెట్స్‌లోనూ చూశాను. బాబీగారు పాజిటివ్, కాన్ఫిడెంట్ ఫిలింమేకర్. ఆయన కారణంగానే నేను ఈ సినిమా చేశాను. తమన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అన్ని చక్కగా కుదిరాయి. డిసెంబర్ 13న విడులవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్టాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా, సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగే చిత్రమిది“ అన్నారు.
డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ – “నేను విధిని నమ్మేవాడిని కానీ.. ఈ సినిమాకు 100 శాతం నమ్మాను. ఎందుకంటే జైలవకుశ సినిమాను కల్యాణ్‌రామ్‌గారు ఎన్టీఆర్‌గారి పేరు మీద పెట్టిన బ్యానర్‌లో తారక్‌తో పని చేశాను. తర్వాత మామ, అల్లుడు మధ్య రిలేషన్‌తో సినిమా చేద్దామని కోనగారు చెప్పగానే.. నిజ జీవితంలో ఓ కుటుంబానికి చెందిన మామ అల్లుడు కలిసి చేసే సినిమా తప్పకుండా బావుంటుందననిపించి విన్నాను. తర్వాత సురేష్‌గారిని కలిసి నెరేషన్ ఇచ్చాను. ఎఫ్2, మజిలీ కంటే ముందు స్టార్ట్ కావాల్సిన ప్రాజెక్ట్.. ఉగాది పచ్చడిలో చేదు, పులుపు, కారం ఇలా ఆరు రుచులుండినా చివరి ప్రొడక్ట్ బావుంటుంది. అలాంటి ఉగాది పచ్చడిలాంటి వ్యక్తి సురేష్‌బాబుగారు. ఆయన ప్రతి అడిగిన దానికి ఓ లాజిక్ ఉంటుంది. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల మేనమామ గుర్తుకొస్తాడు. అలాగే మేనమామలు వాళ్ల అల్లుళ్లు గుర్తుకొస్తారు. తమన్ సెకండాఫ్ చూసి ఫోన్ చేసి, ఎమోషన్ అయ్యాడు. తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. విశ్వప్రసాద్‌గారు, వివేక్ కూచిబొట్లగారికి థ్యాంక్స్. కోనగారికి, శ్రీకాంత్, చక్రవర్తి, మోహన్‌కృష్ణ, అరుణ్ రైటింగ్ పరంగా ఎంతో హెల్ప్ చేశారు. ప్రసాద్ మూరెళ్ళగారు అద్భుతమైన విజువల్స్ అందించారు. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నాచాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించారు. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం…సాలిడ్‌గా వస్తున్నాం“ అన్నారు.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ – “డిసెంబర్ 13న `వెంకీమామ`తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వారం పదిరోజులుగా యూనిట్ అందరిలో థ్రిల్లర్ సినిమాలా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ డిస్కషన్ నడిచింది. ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. నా కెరీర్‌లో మనం, వెంకీమామ చిత్రాలు జ్ఞాపకాలు. రేపు ఎన్ని సినిమాలు వచ్చినా, వీటిని రీప్లేస్ చేయలేం. ప్రతి విషయంలో ఈ సినిమ పరంగా బెస్ట్‌గానే జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్‌లో పనిచేయడం నా కోరిక. లేట్‌గా జరిగినా లేటెస్ట్‌గా ది బెస్ట్‌గా జరిగింది. అది వెంకీమామ పక్కన చేయడం. ప్రేమమ్‌లో ఒక సీన్‌లో చేసేటప్పుడే చాలా ఎగ్జయిట్ అయ్యి చేశాను. ఈ సినిమాలో ప్రతి సీన్‌లో ఎగ్జయిట్‌గా చేశాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు ఆయన్నుండి నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేశాను. బాబీ ఓ మిలటరీ ఎపిసోడ్‌లో నన్ను కొత్త చూపించాడు.. ఈ సందర్భంగా తనకు థ్యాంక్స్. విశ్వప్రసాద్‌గారికి థ్యాంక్స్. రాశీతో కలిసి భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేస్తాను. తమన్, ప్రసాద్ మూరెళ్లగారు, విజయ్‌మాస్టర్, రామ్‌లక్ష్మణ్ మాస్టర్, రవివర్మమాస్టర్ సహా అందరికీ థ్యాంక్స్“ అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ – ” నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ‘వెంకీమామ’ సినిమాకి వచ్చేటప్పటికీ నా కల నిజమైందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎప్ప్పుడు రానా, చైతన్యలతో వర్క్ చేయాలి అనుకుంటాను. నాన్నగారు కూడా మా అందరితో సినిమా తీయాలని కోరుకునేవారు. ఆయన ఉండుంటే ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసేవారు. నాన్నా ఈ సినిమా మీ కోసమే..చైతన్యని మీరు చాలా సినిమాల్లో చూశారు. కానీ ఈ సినిమాలో ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రతి ఎమోషన్ చక్కగా పండించాడు. ఈ సినిమా చైతన్యతో చేయడం హ్యాపీగా ఉంది. రేపు ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. బాబీ ఇలాంటి ఒక మామ అల్లుళ్ళ కథతో రావడమే చాలా గొప్ప విషయం. చాలా సెన్సిబుల్ గా తీశారు. ప్రతి సీక్వెన్స్ బాగా వచ్చింది. బాబీ కి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది. థమన్ మంచి పాటలు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మొదటి నుండి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే చైతన్య కెరీర్ లో బెస్ట్ రోల్ అవ్వాలని మా అన్నయ్య సురేష్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన అనుకున్న విధంగానే చైతన్య క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అలాగే రాశి, పాయల్, ప్రకాష్, రావురమేష్ లతో వర్క్ చేయడం హ్యాపీ. ప్రేక్షుకులు మంచి సినిమాలను ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. అన్ని ఎమోషన్స్ తో బిగ్ కమర్షియల్ మూవీగా డిసెంబర్ 13 న మీ ముందుకు వస్తున్నాం ‘అన్నారు