అవన్నీ పుకార్లే అంటున్న గురు…

265
Venkatesh on Adallu Meeku Joharlu
- Advertisement -

విక్టరీ వెంకటేష్ .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లూ మీకు జోహార్లు అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. గురు చిత్ర షూటింగ్ ని ఈ మధ్యే పూర్తి చేసిన వెంకీ …ప్రస్తుతం ‘నేను శైలజ’ ఫేం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ కూడా పూర్తవ్వగా, కొన్ని కారణాల వలన షూటింగ్‌ ఆగిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దానిపై చిత్ర యూనిట్‌ స్పందించకపోయినా ఇప్పుడు వెంకీ మాటలతో అవన్నీ పుకార్లేనని తెలిసిపోయింది.

ఈ చిత్రం గురించి మాట్లాడిన వెంకీ, “ఇందులో కొత్తగా కనిపిస్తానని, అభిమానులు ఆశించే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయని పేర్కొన్నాడు. గతంలో తాను నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తరహాలో ఇది కూడా మంచి ఎంటర్‌టైనర్‌గా” ఉంటుందని తెలిపాడు.

ఇక ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ తో వెంకటేశ్ రొమాన్స్ చేయనున్నాడట. ఒక హీరోయిన్ గా నిత్యామీనన్ ను, మరో హీరోయిన్ గా అనసూయను సెలెక్ట్ చేశారట. తేజస్వినిని మూడో హీరోయిన్ గా ఎంపిక చేసారని టాక్. మరి నాలుగో హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెబుతారట.

- Advertisement -