- Advertisement -
ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది స్టార్ హీరో వెంకటేశ్ కూతురు అశ్రిత. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అశ్రిత తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే పోస్టుల ద్వారా ఆదాయాన్ని పొందుతోంది. ఒక్కో పోస్టుకు 400 డాలర్లు తీసుకుంటున్న అశ్రిత భారతీయ కరెన్సీలో రూ. 31 వేలు సంపాదిస్తోంది.
హాప్పర్.కామ్ ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌లో ముగ్గురు భారతీయులు ఉండగా ఇందులో విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా,అశ్రిత ఉన్నారు. ఈ లిస్ట్ లో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నారు.
అశ్రిత 377వ స్థానంలో, ఆసియాలో 27వ స్థానంలో ఉంది. వినాయక్ రెడ్డిని వివాహం చేసుకున్న అశ్రిత బార్సిలోనాలో ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ అనే బ్రాండ్‌తో ఆహార వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
- Advertisement -