గ్రాండ్‌గా వెంకీ డాటర్‌ వెడ్డింగ్‌..

584
Venkatesh Daughter Aashritha Marriage
- Advertisement -

టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేశ్‌ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంక‌టేష్ కూతురు ఆశ్రిత పెళ్లి వేడుక నేడు రాజ‌స్థాన్‌లో అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ద‌గ్గుబాటి ఫ్యామిలీ అంతా అక్క‌డికి చేరుకోగా, నిన్న ప్రీ వెడ్డింగ్ వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి చైతూ, సామ్‌తో పాటు స‌ల్మాన్ ఖాన్‌, మ‌రి కొంత‌మంది స‌న్నిహితులు హాజ‌ర‌య్యారు. సోష‌ల్ మీడియాలో చైతూ ఫోటోతో పాటు స‌ల్మాన్‌ఖాన్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

Venkatesh Daughter Aashritha Marriage

ఇక అక్కినేని నాగచైతన్య త‌న సోషల్‌ మీడియా అకౌంట్‌లో వెడ్డింగ్ లొకేష‌న్‌లో స‌మంత‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ వెడ్డింగ్ చిల్లింగ్ అనే కామెంట్ పెట్టాడు. చాలా రహస్యంగా ఈ పెళ్లి వేడుక జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రిలో ఆశ్రిత ఎంగేజ్‌మెంట్ కూడా సీక్రెట్‌గా జ‌రిపారు.

హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవ‌డు వినాయ‌క్ రెడ్డితో ఆశ్రిత ఏడ‌డుగులు వేయ‌నుండ‌గా, వీరి డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి స‌న్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు మాత్ర‌మే హాజ‌రు కానున్నార‌ని తెలుస్తోంది. నిన్న జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో రానా, నాగచైతన్య డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు హైలైట్‌గా నిలిచాయి.

- Advertisement -