బాబి డైరెక్షన్‌లో చై, ‘వెంకీ మామ’..!

215
Venkatesh

తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీ అంటే గతంలో అదో ఊహ మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు.. స్టార్స్ నుంచి చిన్న హీరోల వరకూ ప్రతీ ఒక్కరూ మల్టీ స్టారర్ కాన్సెప్టులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ .. నాగచైతన్యలు హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ‘జై లవ కుశ’ హిట్ తరువాత కొంత సమయం తీసుకుని దర్శకుడు బాబీ మంచి ఇంట్రెస్టింగ్ కథను సిద్ధం చేసుకున్నాడు.

Venkatesh

ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం వెంకటేశ్ .. నాగచైతన్యలను హీరోలుగా ఎంచుకున్నాడు. ఈ ఇద్దరూ బయట మేనమామ .. మేనల్లుడు అనే సంగతి తెలిసిందే. బాబీ సినిమాలోనూ ఈ ఇద్దరూ మేనమామ .. మేనల్లుడు పాత్రలనే పోషించనుండటం విశేషం. అందువల్లనే ఈ సినిమాకి ‘వెంకీ మామా’ అనే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారట.

అయితే ఈ కథ అంతా కూడా విలేజ్‌ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందనుండటం మరో విశేషం. ఎక్కువభాగం షూటింగ్ తమిళనాడులోని ‘కారైకూడి’లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకీ సరసన కథానాయికగా హ్యూమా ఖురేషి .. చైతూ జోడీగా రకుల్ ప్రీత్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.