మ‌హిళ‌కు లిప్‎కిస్ ఇచ్చిన అధ్య‌క్షుడు.. వీడియో వైర‌ల్..

205
philippine-president

నిండుస‌భ‌లో అంద‌రు చూస్తుండ‌గానే… ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడు ఓ మ‌హిళ‌కు ముద్దు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. డ్ర‌గ్ మాఫియాపై ఎన‌లేని పోరాటం చేశాడు అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టి. మ‌హిళ‌కు ముద్దు పెట్ట‌డంతో  ఆయ‌న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఇటివ‌లె ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్‎కు వెళ్లారు డ్యుటెర్టి. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ఫిలిప్పీన్స్ సంతతి ప్ర‌జ‌ల‌తో స‌మావేశం అయ్యారు.

rodrigo-duterte-kiss-south-korea_

ఈ స‌మావేశంలో డ్యుటెర్టీ ఓ పుస్త‌కాన్ని ఆవిష్కంచారు. ఆ పుస్త‌కాన్ని అంద‌జేసేందుకు ఇద్ద‌రు మహిళ‌ల‌ను స్టేజిపైకి రావాల‌ని కోరాడు. ఓ ఇద్ద‌రు మ‌హిళ‌లు స్టేజి మీద‌కు రాగా.. డ్యూటెర్టీ త‌న చేతిలో ఉన్న పుస్త‌కాన్ని ఓ మ‌హిళ‌కు ఇచ్చి.. త‌న చెంప‌పై ముద్దు పెట్టాడు.

ఇక మ‌రో మ‌హిళ‌ను లిప్‎కిస్ ఇవ్వాల‌ని కోరాడు. అధ్య‌క్షుడు మాట‌ల‌కు సందిగ్ధంలో ప‌డిన‌ ఆ మ‌హిళ‌… మ‌ళ్లీ మ‌ళ్లీ తన పెదాల‌ను వేలితో చూపిస్తూ ఇవ్వాల‌ని కోర‌డంతో లిప్‎కిస్ ఇచ్చింది. అనంత‌రం న‌వ్వుతూ ఇద్ద‌రు హ‌గ్ చేసుకున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‎గా మారింది. అధ్య‌క్షుడి ప్ర‌వ‌ర్త‌న మ‌హిళ‌ల ప‌ట్ల‌  స‌రిగా లేద‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

Duterte kisses OFW based in South Korea