ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారు:వెంకయ్య

222
Venkaiah Naidu praises NTR
- Advertisement -

ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు….చరిత్రలో నిలిచిపోయారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. రామకృష్ణ స్టూడియోస్‌లో ఎన్టీఆర్‌ బయోపిక్‌ని క్లాప్ కొట్టి ప్రారంభించిన వెంకయ్య సినిమాను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

శ్రీరామచంద్రుడు,శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడంటే వెంటనే గుర్తొచ్చేది రామారావు అన్నారు. తెలుగు జాతి,భారత జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో ఉంటారన్నారు. తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని…భాషని రక్షించుకోవడం ద్వారానే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అన్నారు. సినిమాల్లోనైనా,రాజకీయాల్లోనైనా చరిత్ర సృష్టించారని తెలిపారు. తెలుగుదనానికి నిండుదనం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.

ఎన్టీఆర్ వారాసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న వెంకయ్యను అభినందించారు. తండ్రికి తగ్గ తనయుడు బాలయ్య అని కొనియాడారు. రామారావు అభిమాని కానివారు సినిమా రంగంలో లేరన్నారు. సినిమా అందరి మన్ననలు పొందాలని,చరిత్ర గుర్తుండిపోయేలా,నిలిచిపోయేలా ఉండాలన్నారు. ఈ సినిమా ఒక మ్యూజియంగా నిలవాలని ఆకాంక్షించారు వెంకయ్య.

తొలిషాట్‌కు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ప్రత్యేకంగా వేసిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమా సెట్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. తొలి దృశ్యంగా కర్ణుడిని రాజ్యాభిషిక్తుడను చేసే సీన్ ను చిత్రీకరించగా, కోట శ్రీనివాసరావు దృతరాష్ట్రుడి పాత్రలో కనిపించగా, జీవి తదితర నటీనటులు ఇతర పాత్రల్లో కనిపించారు.

- Advertisement -