బూతు నేతలకు ఓటుతో గుణపాఠం:వెంకయ్య

9
- Advertisement -

రాజకీయ నాయకులు బూతులు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బూతులు మాట్లాడటం చాలా గొప్ప అనుకుంటున్నారు అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఇనగంటి వెంకట్రావు ‘విలీనం-విభజన’ పుస్తకాన్ని రాశారు. పుస్తకావిష్కరణకు హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పత్రికలు సమాజానికి దర్పణం లాంటివి.. సమాజంలో అవినీతిని ప్రజలకు జర్నలిస్టులు వివరించాలి అన్నారు.

నిజాన్ని తెలియజేసి తీర్పు ఇవ్వటాన్ని ప్రజలకే వదిలేయాలి.. మాట్లాడే భాష హుందాగా మాట్లాడాలి..కొందరి మాటలు వినడానికి కూడా చిరాకుగా ఉంటాయి.. గతంలో బూతులు మాట్లాడే నేతలు ఎవరూ గెలవలేదు..బూతులు మాట్లాడేవారిని వారించాలని ఓ మహిళ నాతో అన్నారు.. పోలింగ్ బూత్ ల ద్వారా బూతు నేతల నోరు మూయించాలని చెప్పా..కలానికి కులం అంటగట్టకూడదు అన్నారు.

Also Read:కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్..ట్రాష్:హరీష్‌

భాష హుందాగా ఉండాలి.. భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి..సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా అలా మాట్లాడడు అన్నారు. యూట్యూబ్‌లో కూడా అలానే పెట్టేస్తున్నారు.. ఏంటని అడిగితే వాళ్ళు అన్నారు సార్ అంటున్నారు అన్నారు.

- Advertisement -