కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మొత్తం ట్రాష్ లాగా ఉంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం రిపోర్టులు ఇచ్చారు.. కానీ అలాంటివి ఏవీ న్యాయస్థానాల్లో నిలబడలేదు … ఇందిరాగాంధీ, చంద్రబాబు మీద కూడా కమిషన్లు వేశారు.. అవి ఏవీ న్యాయస్థానాల్లో నిలబడలేదు అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీని రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారన్న ఆరోపణలపై వాస్తవాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. అసెంబ్లీలో 650 పేజీల కాళేశ్వరం కమిషన్‌పై చర్చ పెట్టండి.. చీల్చి చెండాడుతాం అన్నారు. శాసనసభ వేదికగా నిజాలు ప్రజలకు తెలిసేలా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం…రాజకీయ వేధింపుల కోసం ఇలాంటి ఎన్నో కమిషన్లు రిపోర్టులు ఇచ్చినయ్.. చరిత్రలో ఏది కూడా న్యాయ స్థానాల ముందు నిలబడలేదు అన్నారు.
రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన రిపోర్టులు న్యాయస్థానంలో నిలబడవు…..కాంగ్రెస్ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కమిషన్ల పేరుతో డైలీ సీరియల్స్ ను రేవంత్ నడుపుతున్నారన్నారు. కేవలం కేసీఆర్ ని హింసించాలనే దురుద్దేశం తప్ప.. రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు అన్నారు. పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కుప్పకూలితే NDSA అక్కడికి ఎందుకు వెళ్లలేదు?…. ఇక్కడ తెలంగాణలో ఎవరూ అడగకపోయినా NDSA మేడిగడ్డకు వచ్చి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక రిపోర్ట్, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇంకో రిపోర్ట్ ఇచ్చారు అన్నారు.
ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల కోసమే ఈ కమిషన్ లు… ఉత్తమ్ కుమార్ రెడ్డి, సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడు… ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టినం, 32 శాతం పని చేశామని చెప్పాడు…కానీ 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో పెట్టిన ఖర్చు రూ.3700 కోట్లు మాత్రమే, చేసిన పనులు 10 శాతం లోపే అన్నారు.
ఉమ్మడి రాష్టంలో, ఢిల్లీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆ నాటి కేబినెట్‌లో ఉత్తమ్ మంత్రిగా ఉన్న తమ్మిడిహట్టికి అనుమతులు తీసుకురాలేదు – హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందని అంటాడు.. యాదాద్రి జిల్లాకు పోయి గందమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొడుతాడు..కాళేశ్వరం నీళ్లే గందమల్ల ప్రాజెక్టుకు పోతాయి…మల్లన్న సాగర్ నుండి నీళ్లు మూసీలోకి నీళ్లు పోయడానికి రూ.6000 కోట్లకు టెండర్లు ఫైనల్ చేశాడు అన్నారు.
Also Read;‘ఉస్తాద్ భగత్ సింగ్’..క్రేజీ షెడ్యూల్!
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమే…. కాళేశ్వరం కూలిందని అబద్దపు మాటలు చెప్పి.. గందమల్లకు కొబ్బరికాయలు కొట్టి, మల్లన్నసాగర్‌కు టెండర్లు ఎలా ఖరారు చేస్తావ్ బిడ్డా రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మహారాష్ట్రతో కేసీఆర్ నీళ్లు ఇచ్చి పుచ్చుకునే ఒక చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేశారు అన్నారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేము 152 మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే మీరు ఎలా తగ్గిస్తారని మాట్లాడాడు … దానికి కేసీఆర్ మాట్లాడుతూ నువ్వు… 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు అని గుర్తు చేశారు.

